WNP: త్వరలో జరగనున్న పురపాలికల ఎన్నికలకు సంబంధించి వార్డుల మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి కలెక్టర్ ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. జనవరి 10న ప్రకటించే తుది ఓటరు జాబితాను ఆధారంగా చేసుకుని మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.