ఇన్కమ్ రీప్లేస్మెంట్ టర్మ్ ప్లాన్ అనేది ఒక ప్రత్యేకమైన లైఫ్ ఇన్సూరెన్స్ విధానం. సాధారణ టర్మ్ ఇన్సూరెన్సులో పాలసీదారుడు మరణిస్తే నామినీకి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. కానీ ఈ ప్లాన్లో.. ఆ మొత్తం డబ్బుతో పాటు.. కుటుంబానికి ప్రతి నెలా కొంత ఆదాయం వస్తుంది. అంటే ఇంటి పెద్ద లేకపోయినా.. ఆయన జీతం లేదా ఆదాయం ప్రతి నెలా భర్తీ చేసే విధంగా ఈ ప్లాన్ రూపొందించబడింది.