కృష్ణా: కంకిపాడు(మం) వేల్పూరు గ్రామంలో రూ.25 లక్షల నిధులను చేపట్టనున్న రహదారి మరమ్మతు పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ రహదారి మరమ్మత్తు పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.