నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా ఐదు రోజుల కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు రూ.12.51 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు వెల్లడించారు. ఇక ఈ చిత్రాన్ని ప్రదీప్ అద్వైతం తెరకెక్కించగా.. అనశ్వర రాజన్ కథానాయికగా నటించింది.