AP: చట్టవిరుద్ధంగా అన్నమయ్య జిల్లా కేంద్రం మార్చారని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. జిల్లాల విభజనపై 30 రోజులు గడువు ఇచ్చిన ప్రభుత్వం.. రాయచోటి విషయంలో ఎందుకు సమయం ఇవ్వలేదని ప్రశ్నించారు. రాయచోటి ప్రజల మనోభావాలు తెలుసుకోవడానికి సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేపు రాయచోటిలో నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.