CTR: ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బుధవారం వెదురుకుప్పంలో పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 10:30 గంటలకు మండలంలోని ఆల్లమడుగులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారని తెలిపారు. 11 గంటలకు అదే గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అగ్గిచేను పల్లిలో PGRS కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.