ప్రకాశం: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గిద్దలూరులో ఉన్న ప్రముఖ దేవాలయాల వద్ద అర్బన్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నారు. తోపులాటలు, గుంపులుగా గుమిగూడే పరిస్థితులు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నట్లు సీఐ తెలిపారు.