రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ మూవీ జనవరి 9న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. సాలిడ్ మార్క్‌ని దాటింది. అక్కడ ఇప్పటివరకు 250K డాలర్లకుపైగా వసూలు చేసింది. అంతేకాదు UKలోనే 10వేలకుపైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ మేరకు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ పోస్టర్లు షేర్ చేశారు.