GNTR: జనవరి 4న విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ గుంటూరు జిల్లా అధ్యక్షులు బి. లక్ష్మణరావు కోరారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఫిరంగిపురంలో అఖిల భారత మహాసభల ప్రచార జాతును ప్రారంభించారు. మహాసభలో భాగంగా జరిగే భారీ కార్మిక ర్యాలీ, బహిరంగ సభలను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.