CTR: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వీకోట వేణుగోపాలస్వామి ఆలయాన్ని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు మంగళవారం సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఆలయ మర్యాదలతో సన్మానించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.