BHNG: చౌటుప్పల్ పట్టణానికి చెందిన గోశిక యశ్వంత్ కుమార్ (33) అనే యువకుడు కార్డియాక్ అరెస్ట్‌తో అమెరికాలోని డల్లాస్‌లో మృతి చెందాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ డల్లాస్‌లోని తెలుగు వాళ్ళు నివసించే కమ్యూనిటీలో ఉంటున్న యశ్వంత్ కుమార్ గత సోమవారం తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్‌తో నిద్రలోనే తుది శ్వాస విడిచినట్లు స్నేహితులు తెలిపారు.