TG: బనకచర్లను ఏపీ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకుందో కూడా రేవంత్ రెడ్డికి తెలియదని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. గోదావరి నీళ్లు కృష్ణాలో కలిపితే.. ఆ మేరకు తెలంగాణకు అదనంగా నీళ్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఏపీ ప్రభుత్వం తెలివిగా.. కృష్ణాలో కలపకుండా నల్లమల సాగర్లో కలుపుతోందని విమర్శించారు. ఇది తెలంగాణకు చాలా డేంజర్ అని మండిపడ్డారు.