NTR: కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించే దిశగా ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రూ.500 అంతరాలయ దర్శన టికెట్ పొందిన భక్తులకు కేటాయించే ఉచిత లడ్డూ ప్రసాదాన్ని ఇకపై నేరుగా టికెట్ స్కానింగ్ పాయింట్ వద్దే పంపిణీ చేయనున్నారు. గతంలో దర్శనం తర్వాత ప్రసాదం కౌంటర్ల వద్దకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు స్కాన్ పాయింట్ వద్దే ఇస్తున్నారు.