CTR: పుంగనూరులో జరుగుతున్న అంబేద్కర్ భవన్ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులను మాజీ ఎంపీ రెడ్డప్ప, మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష మంగళవారం పరిశీలించారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మంజూరు చేసిన రూ. 20 లక్షల నిధులతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. పనులు నాణ్యవంతంగా, నిర్దేశించిన కాలంలో పూర్తి చేయాలని సూచించారు.