MNCL: వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహిళ భక్తుల భద్రత కోసం షీ టీం ఆపరేషన్ నిర్వహించారు. ప్రముఖ దేవాలయాల్లో భారీగా మహిళా భక్తులు, బాలికలు తరలివస్తున్న నేపథ్యంలో మహిళలపై వేధింపులను అరికట్టడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సివిల్ డ్రెస్సులో ప్రత్యేక డెకాయి ఆపరేషన్లు నిర్వహించినట్లు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్సై ఉషారాణి తెలిపారు.