SKLM: మహారాష్ట్ర నందడ్లో మంగళవారం జరిగిన రోలర్ స్కేటింగ్ స్పోర్ట్స్ వీక్ నేషనల్ ఛాంపియన్ షిప్ 2025లో రోలర్ స్కేటింగ్ విభాగంలో పలాసకు చెందిన జక్కల తోషిని రోయ్ సత్తా చాటింది. 300 మీటర్ల పోటీలో బంగారు పతకం సాధించి అందరూ దృష్టి ఆకర్షించింది. చిన్నారి ప్రతిభ పట్ల రోలర్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ బి.చంద్రావతి, సభ్యులు అభినందనలు తెలిపారు.