తన దృష్టిలో వరుణ్ చక్రవర్తి టీమిండియాకు ‘బౌలర్ ఆఫ్ ది ఇయర్’ అని మాజీ క్రికెటర్ అశ్విన్ వెల్లడించాడు. అతడు జట్టుకు ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అని కొనియాడాడు. టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 సాధించడంలో వరుణ్ కీలకపాత్ర పోషించబోతున్నాడని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా అతడు టీ20 స్పెషలిస్ట్ బౌలర్ అని అశ్విన్ పేర్కొన్నాడు. నిజానికి అతడో ఆర్కిటెక్ట్ అని కితాబిచ్చాడు.