SRD: సీసీఐ రైతుల నుంచి పత్తి కొనుగోలు పరిమితిని పెంచడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కంగ్టి రైతు వేదిక కార్యాలయానికి రైతులు భారీగా చేరుకున్నారు. స్థానిక ఏఈవో స్వాతి రెడ్డిని సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. ఎకరాకు పత్తి కొనుగోలు పరిమితి 10 క్వింటాలుగా పెరగడంతో రైతులు తమ పంటను నమోదు చేసుకొని స్లాట్ బుకింగ్ పూర్తి చేశారు.