CTR: గుంటూరులో జరుగుతున్న ఎలైట్ అండర్-19 క్రికెట్ టోర్నీలో చిత్తూరు జిల్లా వి.కోట విద్యార్థి కార్తీక్ అదరగొట్టాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడుతున్న అతను సెమి ఫైనల్లో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ క్రికెట్ అకాడమీ జట్టుపై చెలరేగి ఆడాడు. ఓపెనర్‌గా వచ్చిన కార్తీక్.. 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 బంతుల్లోనే 96 రన్స్ చేశాడు.