KMR: ఇసాయిపేటలో ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరక్టర్గా పని చేస్తున్న బట్టుపల్లి రేణుక దక్షిణ భారత దేశ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైనట్లు పాఠశాల HM దయానంద సరస్వతి తెలిపారు. జనవరి 3న విజయవాడలో జరిగే కార్యక్రమంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ఇవాళ చెప్పారు. విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు అభినందించారు.