HYD: నాచారం హెచ్ఎంటీ నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం వేకువజామున 4 గంటల నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుమారు 12 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సహా పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.