AP: మాజీమంత్రి కాకాణి తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరు ఇరిగేషన్ శాఖలో రూ.100 కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని విమర్శించారు. ‘ఇరిగేషన్ అధికారులు ఫోన్ పే ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయించుకుంటున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరినీ వదిలిపెట్టం. అక్రమంగా సంపాదించిన ఆస్తులు అమ్మి నష్టపోయిన వారికి చెల్లిస్తాం. రిటైర్డ్ అయినా అధికారులను వదిలిపెట్టబోము’ అని హెచ్చరించారు.