బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమాపై చైనా మీడియా అక్కసు వెళ్లగక్కింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌పై గ్లోబల్ టైమ్స్ ఆరోపణలు చేసింది. ఈ సినిమా ద్వారా సైద్ధాంతిక విషాలు నింపుతున్నారని, జాతీయవాద మెలోడ్రామాగా పేర్కొంది. 2020లో గల్వాన్ వద్ద భారత బలగాలే చైనా భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డాయని, చర్చలు సమయంలో హింసాత్మక దాడి చేశాయని ఆరోపించింది.