GNTR: పదవ తరగతి విద్య భవిష్యత్తుకు కీలకమని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు. గుంటూరు నగరంలోని ఏటి అగ్రహారంలో ఉన్న ఎస్కేబీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఇవాళ ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. క్రమశిక్షణతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు.