ATP: అనంతపురం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో 65వ జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (DIEPC) సమావేశాన్ని కలెక్టర్ ఓ.ఆనంద్ మంగళవారం నిర్వహించారు. జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సత్వరమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించారు.