HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ శ్రీ శివాలయం ప్రాంగణంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ ముక్కోటి వైకుంఠ ఏకాదశి సంధర్భంగా, శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి తెల్లవారుజాము నుంచి ప్రత్యేకంగా అభిషేకం చేసి, దివ్యంగా అలంకరించి, విశేష పూజలు చేస్తున్నారు. ఆలయాన్ని పూలమాలలతో చక్కగా తీర్చిదిద్దారు. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు.