ATP: వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త రామాంజినేయులును అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ మంగళవారం పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శివ, ట్రెజరర్ అయ్యన్న పాల్గొన్నారు.