VSP: భీమిలిలో ఎస్సీఆర్డబ్ల్యుఏ భీమిలి యూనిట్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు డైరీలు, స్వీట్లు మంగళవారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గంటా నూకరాజు పాల్గొని జర్నలిస్టుల సేవలు సమాజానికి అమూల్యమని అన్నారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.