WGL: రాయపర్తి మండలం కొండూరులో గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ చీరల పంపిణీ జరిగింది. పాలకుర్తి ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు సర్పంచ్ రాయిని యాకన్న అర్హులైన మహిళలకు చీరలు అందజేశారు. మహిళల సంక్షేమం, పేదల అభివృద్ధే లక్ష్యంగా ఈ పథకం ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు.