AP: గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ పాయింట్లను సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. 2023లో ఇచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్లో సుప్రీంకోర్టు ప్రకారం రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం ఈ పిటిషన్లను కొట్టివేసింది.