GDWL: గద్వాల పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ అలంకారంగా మారాయి. పాత బస్టాండ్ వద్ద సిగ్నల్ లైట్లను కప్పివేసేలా బ్యానర్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్ స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు వాహనదారులు సిగ్నల్స్‌ను పట్టించుకోకపోవడం ట్రాఫిక్ సమస్యను మరింత పెంచుతోంది.