మెదక్‌లోని హన్మంతరావు కాలనీలో గల శ్రీ లక్ష్మీమరకత వేంకటేశ్వర స్వామిని ఎస్పీ శ్రీనివాస రావు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆయన తల్లితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆయన తెలిపారు.