NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరిగిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండలో పార్టీ కార్యాలయంలో చందంపేట మండలం చిత్రియాల గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించిన చాట్ల చిరంజీవిని అభినందించి, శాలువాతో సత్కరించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.