GNTR: ఫిరంగిపురం పీఎన్సీ కళాశాల సమీపంలో మంగళవారం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. నరసరావుపేట నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ను స్థానికులు 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.