ADB: ఇచ్చోడ మండలంలోని మేడిగూడ ఆశ్రమ బాలికల పాఠశాల వసతి గృహంలోని సరుకులను అక్రమంగా అమ్ముకున్న హెడ్ మాస్టర్, వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ PDSU జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ కోరారు. ఈ మేరకు జిల్లా నాయకులు అదనపు కలెక్టర్ శ్యామలదేవిని కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.