నెల్లూరులో ఎప్పుడూ లేని విధంగా అవినీతి జరుగుతోందని మాజీమంత్రి కాకాణి గోవర్థన్ మండిపడ్డారు. ఇరిగేషన్ అధికారులు నారాయణ రెడ్డి, గంగాధర్ భారీగా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు.