RR: ఒక్కోసారి తలనొప్పి కూడా ప్రాణాంతకం కావచ్చని యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ జయనంద్ సుధీర్ అన్నారు. షాద్ నగర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన సాజిద్ అనే వ్యక్తికి సకాలంలో అత్యవసరం మెదడు శస్త్ర చికిత్స చేసి రోగి ప్రాణాలను కాపాడినట్లు స్పష్టం చేశారు. బ్రెయిన్ అన్యూరిజం పగిలితే అత్యవసర చికిత్స అవసరమన్నారు.