KRNL: ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ఎమ్మిగనూరులో కొనసాగుతున్న రిలే దీక్షకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీక్ష 21వ రోజున పెన్షనర్ల సంఘ సభ్యులు దీక్షలో కూర్చొని ఉద్యమానికి మంగళవారం సంఘీభావం తెలిపారు. ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ న్యాయమైనదని పేర్కొంటూ, ప్రభుత్వాన్ని వెంటనే నిర్ణయం తీసుకోవాలని జేఏసీ నాయకులు కోరారు.