ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్లోరిడాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ట్రంప్‌నకు ఇజ్రాయెల్ శాంతి పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘ట్రంప్ ఎన్నో ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే 80ఏళ్లలో తొలిసారి ఇజ్రాయెల్ జాతీయుడు కాని వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వాలని డిసైడ్ అయ్యాం’ అని తెలిపారు.