నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మూవీ ‘అఖండ 2’. డిసెంబర్ 12న రిలీజైన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. తాజాగా, ఈ మూవీ టికెట్ ధరల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1 నుంచి నైజాంలో ఈ మూవీ టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.105, మల్టీప్లెక్స్‌లో రూ.150గా ఉండనున్నట్లు తెలిపారు.