SKLM: శ్రీరాముడు నడయాడిన పవిత్ర క్షేత్రంగా పేరొందిన రామ తీర్ధం ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఇవాళ దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.