AP: స్త్రీ శక్తి పథకం ద్వారా 3.25 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించారని సీఎం చంద్రబాబు తెలిపారు. 2025లో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్గా నిలిచాయన్నారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా ఇప్పటికే రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మెగా డిఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులను, 5,757 కానిస్టేబుళ్ల నియామకాలను పూర్తి చేసినట్లు చెప్పారు.