MDK: నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో మంగళవారం ప్రాథమిక పశు ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుధాకర్ ఉచిత నట్టల నివారణ మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నట్టల మందు తాగించడం ద్వారా జీవాల్లో మంచి పెరుగుదల ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొండ సంతోష, ఉప సర్పంచ్ విజయ్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.