ఢిల్లీలోని కీలక వీఐపీ-89 జోన్లో గగనతల భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ సమీకృత ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని విలువ రూ.5,181 కోట్లు. దీన్ని DRDO అభివృద్ధి చేసింది. ఇది దేశ రాజధాని పరిధిలోని 30 కిలోమీటర్ల వరకు ఎటువంటి ముప్పులనైనా అడ్డుకోగలదు.