భారత్, పాకిస్తాన్ యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ ఫ్లోరిడాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్.. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను తానే పరిష్కరించినట్లు చెప్పారు. అయినా తనకు క్రెడిట్ దక్కలేదన్నారు. కాగా, ఇప్పటికే చాలాసార్లు భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.