విశాఖ: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేక పూజలతో ఘనంగా ముగిసింది. దేవేరుల సహితంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, దివ్య ప్రబంధం నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహించగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.