ప్రకాశం: వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల వద్ద పోలీసులు భద్రతను చేపట్టారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేచి ఉండే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తోపులాటలు జరగకుండా పకడ్బందీగా క్యూలైన్లను నిర్వహిస్తున్నారు. భక్తజన సందోహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి, భద్రతను పర్యవేక్షించడానికి డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు.