JGL: మల్యాల మండలం ముత్యంపేట గ్రామ శివారులోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని కలెక్టర్ దంపతులు ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.