MDK: ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు మక్కువ చూపాలని పెద్ద శంకరంపేట మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ అన్నారు. ఉత్తులూర్ గ్రామంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్లో సిద్దేశ్వర్ రావు ఆధ్వర్యంలో రైతులతో కలిసి మొక్కలు నాటారు. వరి సాగు చేసే రైతులు ఆయిల్ పామ్ వేసుకోవడానికి ముందుకు రావాలన్నారు. సాగుకు గాను ప్రభుత్వం మొక్కలకు, డ్రిప్పుకు 90శాతం రాయితీ ఇస్తుందని ఆయన తెలిపారు.