JGL: వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయానికి అధికంగా భక్తులు రావడంతో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు.